BUS YATRA: ప్రకాశం జిల్లా త్రిపురాంతంకం మండలం జి.ఉమ్మడివరంలో శనివారం రాత్రి జరగాల్సిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర... సమయాభావంతో నిర్వహించలేదు. రాత్రి 12 గంటలకు బస్సు జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటికే ఆలస్యమైనందున బస్సు ఆపకుండా మంత్రులు ముందుకు సాగిపోయారు. జిల్లా మంత్రి సురేష్ ఒక్కరే వేదికపైకి వచ్చి కాసేపు ప్రసంగించారు. అంతకుముందు సభ కోసం వచ్చిన ప్రజలు వెనుదిరగకుండా వేదికపై యువతులతో డ్యాన్సులు వేయించారు.
ఆలస్యంగా మంత్రులు.. జనం వెళ్లిపోకుండా ఏం చేశారంటే..! - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
BUS YATRA: రాష్ట్రంలో వైకాపా మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ప్రకాశం జిల్లాలో సమయం అనుకూలించకపోవడం వల్ల బస్సు యాత్ర జరగలేదు. కాకపోతే జి.ఉమ్మడివరంలో బస్సు యాత్రకు సంబంధించిన సభను ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన జనం వెనుదిరగకుండా వేదికపై యువతులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర.. జనం వెనుదిరగకుండా వేదికపై యువతులతో నృత్య ప్రదర్శన