ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిట్టుబాటు ధరలేక చేమదుంప సాగుకు నష్టం - Damage to unaffordable sweet potato cultivation

గిట్టుబాటు ధర లేక... పెట్టుబడులు రాక....ప్రకాశం జిల్లాలో చేమదుంప పండించే రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గిరాకీ ఉన్నా.. పెట్రో ధరల మంటతో అక్కడ నుంచి లారీలు రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Damage to unaffordable sweet potato cultivation
గిట్టుబాటు ధరలేక చేమదుంప సాగుకు నష్టం

By

Published : Feb 27, 2021, 6:34 PM IST

గిట్టుబాటు ధరలేక చేమదుంప సాగుకు నష్టం

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో చేమదుంపల సాగుతోనే రైతుల జీవనం సాగుతుంది. వేలాది ఎకరాల్లో ఏటా ఇదే పంట పడిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ నుంచి చేమదుంపలు ఎక్కువగా ఆగ్రా మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంటారు. ఒకప్పుడు వందల సంఖ్యలో లారీలతో వచ్చి వ్యాపారులు చేమదుంపలు కొనుగోలు చేసేవారు. కరోనా వ్యాప్తితోపాటు.. డీజీల్ ధరలు పెరగటం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. బయట ప్రాంతాల నుంచి ఎవరూ రాకపోవటంతో.... స్థానిక మార్కెట్ మీద ఆధారపడుతున్నా.. కొనేవారు లేక తీవ్ర నష్టం తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. కూలీలకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని రైతులు అంటున్నారు. ఎకరాకు 50 వేల రూపాయలు పైబడి నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని... స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలని చేమదుంప రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details