ప్రకాశం జిల్లాలో తల్లీ, బిడ్డను కిరాతకంగా చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసును ఒంగోలు పోలీసులు ఛేదించారు. జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం పేర్నమిట్టకు వెళ్లే దారిలో తల్లీ బిడ్డ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు పెద్దకొత్తపల్లి గ్రామంలోని సీసీ కెమెరాల ఆధారంగా హంతకుణ్ని గుర్తించారు. నిందితుడు అద్దంకివాసిగా గుర్తించిన పోలీసులు.. అతను ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ స్టోర్ ఇంఛార్జీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
తల్లీ బిడ్డను తగలబెట్టిన నిందితుడు అరెస్ట్ - తల్లీ బిడ్డను తగలబెట్దిన నిందితుడు అరెస్ట్
ప్రకాశం జిల్లాల ో తల్లీబిడ్డను పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ దృశ్యాలు ఆధారంగా నిందితుడు అద్దంకి వాసిగా గుర్తించారు.
తల్లీ బిడ్డను తగలబెట్దిన నిందితుడు అరెస్ట్
Last Updated : Dec 10, 2019, 11:13 PM IST