ప్రకాశం జిల్లా ఒంగోలు బంగారు వర్తకుడు నల్లమల్లి బాలుకు చెందిన నగదు చెన్నైలో పట్టుబడటంతో ఐటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నగదు తనేదే అని ప్రకటించడంతో పాటు, తగిన రికార్డులు అధికారులకు అందజేసే విషయంలో వ్యాపారి తమిళనాడు వెళ్లినట్లు సమాచారం. ఆ వ్యాపారికి చెందిన సంస్థలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిస్తోంది.
రైళ్లు లేక రోడ్డు మార్గంలో
ప్రకాశం జిల్లాలో బంగారు వ్యాపారమంతా తమిళనాడుతో సంబంధాలు కలిగిఉంటాయి. నగలు, నగదు లావాదేవీలన్ని రైలు మార్గంలో కొంతమంది మధ్యవర్తుల సహకారంతో జరుపుతుంటారు. రైలులో నగదు విషయంలో పెద్దగా తనిఖీలు ఉండవు కనుక ఐటీ అధికారులు కళ్లుగప్పి నగదు తరలిస్తుంటారు. అయితే లాక్ డౌన్ వల్ల రైళ్లు పరిమితంగా తిరుతుండడంతో రహదారి మార్గంలో నగదు తరలిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులో ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ వాహనాన్ని, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాన్ని వినియోగిస్తుంటారు.
వివాదంలో ఇరుకున్న మంత్రి
ఇందులో భాగంగానే బంగారు వ్యాపారి నల్లమిల్లి బాలు ఇలానే వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది. అయితే తాజా సంఘటనతో రాజకీయ అంశం కూడా చర్చినీయాంశం అయ్యింది. ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన వాహనంలో రూ. 5.2 కోట్లు నగదు లభించడం సంచలనం రేపింది. బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు ఒంగోలు ఎమ్మెల్యే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడు కావడం, వైకాపా తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండటంతో ఈ వ్యవహారం మంత్రి చుట్టూ తిరుగుతుంది. మంత్రికి, ఈ నగదును ఎలాంటి సంబంధం లేదని, ఈ నగదు తన వ్యాపారాన్ని సంబంధించినది అని నల్లమల్లి బాలు ప్రకటించారు.
స్టిక్కర్లు ఎక్కడివి?