ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలో మొసలి సంచారం - ప్రకాశం తాజా వార్తలు

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలో మొసలి సంచరిస్తోందనే వార్తతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి మొసలి జాడ మాత్రం తెలియలేదు. రేపు కూడా కాలువ మీద పర్యటించి మొసలిని కనుగొని పట్టి వేరేచోటకు తరలిస్తామని అటవీ శాఖాధికారి తులసీరావు తెలిపారు.

Crocodile wandering in the main canal of Nagarjuna Sagar
నాగార్జున సాగర్ ప్రధాన కాలువలో మొసలి సంచారం

By

Published : Nov 8, 2020, 8:24 AM IST

ప్రకాశంజిల్లా కురిచేడు మండలం బయ్యారం గ్రామం వద్ద మొసలి సంచరిస్తోందనే వార్త స్థానికంగా సంచలనం రేపింది. మొసలి కాలువ గట్టు మీద తలవాల్చి కదలకుండా సుమారు రెండు గంటలవరకు పడుకొని అలానే ఉందని జనార్ధన్ అనే ఓ వ్యక్తి తెలిపాడు. ద్విచక్ర వాహనంపై సాగర్ కాలువ కట్టపై ప్రయాణిస్తుండగా... గట్టుమీద ఉన్న మొసలిని చూశాడు. అనంతరం ఆ దృశ్యాన్ని చరవాణితో చిత్రీకరించి వాటిని వాట్సాప్ గ్రూపులలో పొందుపరచారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికి మొసలి జాడ మాత్రం తెలియలేదు. రేపు కూడా కాలువ మీద పర్యటించి మొసలిని కనుగొని పట్టి వేరేచోటకు తరలిస్తామని అటవీ శాఖాధికారి తులసీరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details