ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాచర్ల గ్రామంలో 10 మంది మిర్చి కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందగా... మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించగా... గ్రామానికి తీసుకురాకుండా నేరుగా శ్మశానానికి తరలించారు.
కడచూపు చూసుకునేందుకు బంధువులు శ్మశానానికి పరుగులు తీశారు. గ్రామంలోని ఒకే ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందిన కారణంగా.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు, నాయకులు సానుభూతి తెలిపారు.