ప్రకాశం జిల్లా ఒంగోలులో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సీపీఎస్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి కలెక్టరేట్ మీదుగా ఎన్జీవో భవన్ వరకు ర్యాలీ చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు. కమిటీల పేరుతో తాత్సారం చేయకుండా నెల రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓపీఎస్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో కృష్ణ.. గుంటూరు... ప్రకాశం.. నెల్లూరు జిల్లాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
'సీపీఎస్ రద్దు చెయ్యండి... ఇచ్చిన మాట నిలబెట్టుకోండి' - Contributory Pension Latest News in telugu
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఒంగోలులో సీపీఎస్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు.
cps employees rally in ongole
Last Updated : Dec 16, 2019, 11:39 AM IST