కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ప్రకాశం జిల్లా చీరాల ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. తక్షణమే సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాప్తి చెందుతుందన్నా...ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం దారుణమన్నారు. వైద్యశాలలో కనీస సౌకర్యాలు, సిబ్బంది లేక రోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సిబ్బంది కొరత తీర్చాలని డిమాండు చేశారు.
ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం - ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాప్తి చెందుతుందన్నా...ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం దారుణమని ప్రకాశం జిల్లా చీరాలలో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు.
ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం