కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... సాయం చేయాల్సింది పోయి... ప్రభుత్వాలు మరింత భారం మోపుతున్నాయని ప్రకాశం జిల్లా చీరాల సీపీఎం నాయకులు అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 196,197,198 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు. ఆ ఉత్తర్వుల ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వసంతరావు, బాబురావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను దొడ్డిదారిన తెచ్చిందని.. వీటి వల్ల ఆస్తి పన్ను, చెత్త పన్ను ఇతర చార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై అధిక భారం మోపే దిశగా సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
'సాయం చేయాల్సింది పోయి... పేదల నుంచే తీసుకుంటారా?'
కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ప్రభుత్వం సాయం చేయాల్సింది పోయి... ప్రజల నుంచే తిరిగి పన్నులు వసూలు చేస్తారా.. అని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. చీరాలలో ఆందోళన వ్యక్తం చేశారు.
సాయం చేయాల్సింది పోయి...పేదల నుంచే తీసుకుంటరా?
TAGGED:
ప్రకాశం జిల్లా వార్తలు