ప్రకాశం జిల్లా అద్దంకిలోని శ్రీరామ్ కాలనీలో నివాసముంటున్న ఎస్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మొదటి విడతలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్లాట్ నెంబర్లు ఇచ్చినా.. స్థలాలు కేటాయించకపోవడం సమంజసం కాదని అన్నారు. అర్హులు కాదని సుమారు 20 మందికి స్థలాలు కేటాయించేందుకు అధికారులు నిరాకరించారని తెలిపారు. నిరుపేదలకు స్థలాలు ఇవ్వకుండా చేస్తున్నారని తక్షణమే వారికి న్యాయం చేయాలని తహసీల్దార్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
'ప్లాట్ నెంబర్లు ఇచ్చారు సరే.. స్థలాల కేటాయింపు ఏది'
మొదటి విడతలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్లాట్ నెంబర్లు ఇచ్చినా.. ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడంపై అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. అర్హులు కాదని సుమారు 20 మందికి స్థలాలు కేటాయించేందుకు అధికారులు నిరాకరించారని.. వెంటనే వారికి స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా