వైకాపా ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు(cpi ramakrishna fires on jagan news) గుప్పించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిందన్నారు. ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందని దుయ్యబట్టారు. అప్పులు తెస్తేనే రాష్ట్ర మనుగడ, లేకపోతే దుర్భర పరిస్థితి అన్నట్లుగా మారిందన్నారు. అందని ద్రాక్షలా ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగిపోయాయని ఆక్షేపించారు.
'రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పింది. ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోంది. అప్పులు తెస్తేనే రాష్ట్ర మనుగడ, లేకపోతే దుర్భర పరిస్థితి అన్నట్లు ఉంది. అందని ద్రాక్షలా ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు. జగన్ ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టింది' - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి