టిడ్కో గృహాలను రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ముందు టిడ్కో ఇళ్ల సమస్యపై వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ ఆందోళనలకు స్పందించే ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటన చేసిందన్నారు రామకృష్ణ.
కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న గృహాలను తక్షణం పూర్తి చేసి, నివాసయోగ్యంగా తయారు చేయాలని ఆయన కోరారు. పారిశుద్ధ్యం నిర్వహణ, విద్యుత్తు సరఫరా, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. అన్ని సౌకర్యాలతో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించే వరకు అన్ని రాజకీయ పక్షాలతో కలిసి తాము పోరాటం కొనసాగిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.