ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం ఆలోచన దారుణమని వామపక్ష నాయకులు విమర్శించారు. రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
సీపీఎం ఏరియా కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ఆలోచనలు చేస్తోందని ఆరోపించారు. కరోనాను అవకాశంగా తీసుకుని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లాభాల్లో ఉన్న రైల్వేను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చౌకీదార్‌గా ఉంటానని చెప్పిన ప్రధాని మోదీ.. ఇప్పుడు చోరీదార్గా మారారని విమర్శించారు.