ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని తండాల్లో కొందరు పశువుల యజమానులు, కాపరులు వందల సంఖ్యలో గోవులను తోలుకుని ఆయకట్టు ప్రాంతానికి బయలుదేరారు. వేసవి రాక ముందే పశువులకు మేత కరువైందని... అందుకోసం వలస వెళ్తున్నామని కాపరులు తెలిపారు. వర్షాలు కురిస్తే తమ ప్రాంతాలకు తిరిగి వస్తామని పశు యజమానులు చెబుతున్నారు. జనవరి చివర్లోనే పశువులకు మేత దొరక్కపోవడంపై ఆవేదన చెందుతున్నారు.
మా ఆకలి తీరేందుకు వలస వెళ్లాల్సిందే..! - cows facing water problems in yarragondapalem
వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్న వేళ మూగజీవాలకు మేత దొరకడం లేదు. జనవరి చివర్లోనే పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పశువులు మేతకై పచ్చగడ్డి, తాగునీటికి ఇక్కట్లు లేని.... కృష్ణా డెల్టా వైపు పశువులను రైతులు తీసుకెళ్తున్నారు.
యర్రగొండపాలెంలో ఆకలి కోసం ఆవుల వలస
TAGGED:
cows facing water problems