కరోనాను కట్టడి చేయడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ కొవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి కైలాష్ గిరీష్ అన్నారు.. చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్‌ను ఆయన పరిశీలించారు.
ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకల వివరాలు తెలియజేసే విధంగా బోర్డు ఉండాలని, కొవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. చీరాలలో కరోనా కేసులు సోకిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకూడదని, విధిగా మాస్కులు ధరించాలని.. కైలాష్ గిరీష్ సూచించారు.
చీరాల ఆసుపత్రిని పరిశీలించిన కొవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని.. ప్రకాశం జిల్లా చీరాల కొవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి కైలాష్ గిరీష్ తెలిపారు. చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్‌ను ఆయన పరిశీలించారు. చీరాలలో కరోనా సోకిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
covid officer