ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఊరికి వెళ్లాలంటే నెగిటివ్​ రిపోర్ట్​ తప్పదు మరి..! - Covid rules campaign with Mike in Chinganjam panchayath

కరోనా కారణంగా ఏడాది క్రితం ఏన్నో గ్రామలు స్వచ్ఛందంగా తమ సరిహద్దులు మూసివేశాయి. ప్రస్తుతం కొవిడ్​ వ్యాప్తి రెండవ దశకు చేరుకోవటంతో.. నాటి పరిస్థితి పునరావృత్తం అయ్యేలా ఉన్నాయి. తమ ఊరి ప్రజలపై కొవిడ్​​ నిబంధనలను కఠినంగా విధించటమేకాక.. బయట వ్యక్తులు ప్రవేశించాలంటే నెగిటివ్​ రిపోర్ట్​ తప్పనిసరి అని ప్రచారం చేస్తున్నారు ఓ పంచాయతీ వారు. ఇంతకీ ఆ పంచాయతీ ఎక్కడంటే?

Chinganjam Panchayath
చినగంజాం పంచాయితీ

By

Published : Apr 22, 2021, 3:58 PM IST

చినగంజాం పంచాయితీ

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా గ్రామాల్లో ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చినగంజాం పంచాయతీ ఆధ్వర్యంలో కొవిడ్​ నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామంలోని వీధుల్లో మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. గ్రామంలో విధిగా అందరూ భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఆంక్షలు విధించారు. అంతేనా.. బయట వ్యక్తులకు ప్రవేశం నిషిద్ధం అని, ఒక వేళ రావాలంటే కొవిడ్​ నెగిటివ్​ రిపోర్టు తప్పని సరి అని ప్రచారం చేయిస్తున్నారు పంచాయితీ పెద్దలు. నిబంధనలు ఉల్లంగిస్తే జరిమానా, చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details