ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చికిత్స కోసం వెళ్లి.. వీల్ చైర్​లోనే ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ రోగి - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

కరోనా చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ వృద్ధుడు ఓపీ సేవల వద్ద వీల్ చైర్​లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఒంగోలు రిమ్స్​ ఆసుపత్రిలో జరిగింది. మంచం కేటాయించేలోపే ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలచివేసింది.

covid patient died
వీల్ చైర్​లోనే ప్రాణాలు కోల్పోయిన కొవిడ్ రోగి

By

Published : May 11, 2021, 10:12 PM IST

వీల్ చైర్​లోనే ప్రాణాలు కోల్పోయిన కొవిడ్ రోగి

ఆసుపత్రిలో చేరకముందే ఓ కోవిడ్ రోగి ప్రాణాలు విడిచాడు. ప్రకాశంజిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఓ వృద్ధుడు చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్​కు తీసుకువచ్చారు.

అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాధితుణ్ని ఓపీ రాయించుకొని మంచం కేటాయిస్తారని వేచి చూశారు. ఓపీ కౌంటర్​ వద్ద ఆక్సిజన్ కూడా అందించారు. కానీ మంచం కేటాయింపు జరగకుండానే.. వీల్ చైర్ మీదే ఆయన ప్రాణాలు విడిచాడు.

ABOUT THE AUTHOR

...view details