ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు - 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు 60 వేల మార్కును దాటాయి. కొత్తగా 1,811 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,717కు చేరుకుంది. జీహెచ్​ఎంసీలో అత్యధికంగా మరో 521 కరోనా కేసులు నమోదయ్యాయి.

covid cases raised in telangana
తెలంగాణలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

By

Published : Jul 30, 2020, 11:25 AM IST

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 1,811 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 60,717కు చేరుకుంది. వైరస్ కారణంగా 13 మంది మృత్యువాత పడగా... ఇప్పటివరకు 505 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 15,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొవిడ్​ బారి నుంచి 44,572 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా 18,263 పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు 4,16,202 టెస్టులు చేశారు. జీహెచ్​ఎంసీలో అత్యధికంగా మరో 521 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్ అర్బన్​లో తరువాత స్థానంలో ఉన్నాయి.

ఇదీ చదవండి: జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నా: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details