నవదంపతులు ఆత్మహత్య
నవదంపతులు ఆత్మహత్య - family
ప్రకాశం జిల్లాలో నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు నెలల క్రితమే వీరికి వివాహం అయింది. దంపతులు బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

couple-suicide-at-ongole
పురుగుల మందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడకు చెందిన నవదంపతులు పిక్కిలి రామయ్య, చంద్రవతి..... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మూడు నెలల క్రితమే వీరికి వివాహమైంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.