అక్రమంగా నిలువ ఉంచిన 21 బస్తాల నకిలీ పత్తివిత్తనాలను ప్రకాశం జిల్లా ఇంకొల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సు మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో ట్రాక్టర్లో అక్రమంగా నిలువ ఉన్నాయనే సమచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సుమారు 20 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 20 లక్షల విలువైన నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం - 20 లక్షల విలువైన నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం
ప్రకాశంజిల్లా ఇంకొల్లులో అక్రమంగా నిలువ ఉంచిన 21 బస్తాల నకిలీ పత్తివిత్తనాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సు మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం
ఇంకొల్లు కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు దాడులు చేసి... విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నకిలీ పత్తి వితనాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.