ప్రకాశం జిల్లా గిద్దలూరులో గణేష్ నగర్ స్టేట్ బ్యాంక్ వద్ద సంజీవిని బస్సులో కరోనా పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు కొవిడ్ పరీక్షలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే కేవలం వంద మందికి మాత్రమే అవకాశం ఉందని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. వంద స్లిప్పులు అయిపోవడంతో పలువురు కరోనా పరీక్షలు చేసుకోకుండానే వెనుదిరిగారు.
వంద మందికే అవకాశం.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు - ప్రకాశం జిల్లాలో సంజీవిని బస్సులు తాజా వార్తలు
ప్రభుత్వం కరోనా పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సంజీవిని బస్సులో పరీక్షలు నిర్వహించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. అయితే కేవలం వంద మందికి మాత్రమే అవకాశం ఉందని తెలుసుకొని వెనుదిరిగారు.
![వంద మందికే అవకాశం.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు corona tests in sanjeevini bus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8191195-1002-8191195-1595846633387.jpg)
కరోనా పరీక్షల కోసం బారులు తీరిన జనం