ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో పూజారులకు కరోనా పరీక్షలు - Corona tests for priest in chirala news

దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాలతో ప్రకాశం జిల్లా చీరాలలోని వివిధ ఆలయాల్లోని పూజారులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు వీరికి కొవిడ్-19​ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు.

Corona tests for priests
చీరాలలోని పూజర్లకు కరోనా పరీక్షలు

By

Published : Jun 15, 2020, 7:03 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాలతో పేరాల శివాలయంలో మేనేజర్ శివనాగదాసు ఆధ్వర్యంలో వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న 70 మంది పూజారులకు పరీక్షలు జరిపించారు. ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు నాగరాజు, కమలశ్రీలు వారికి కోవిడ్-19 పరీక్షలు చేశారు. పూజారులు అందరూ భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు కారంచేటి నగేష్, వాసుదేవాచార్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details