కరోనా ఉందనే అనుమానంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. ఇటీవల వివాహ వేడుకల నిమిత్తం పలు ప్రాంతాలు వెళ్లి వచ్చానని... అప్పటి నుంచి తీవ్ర జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని వైద్యులకు తెలిపాడు. తొలుత స్థానిక ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి వైద్యులు మార్కాపురం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పది రోజులకు సరిపడా మందులు ఇచ్చి పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని.. నిత్యం చేతులను శుభ్రపరుచుకోవాలని బాధితునికి సూచించారు. అనంతరం ఆ వ్యక్తితోపాటు అతని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు.
మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి కరోనా అనుమానితుడు - మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి కరోనా అనుమానితుడు
కరోనా వచ్చిందనే అనుమానంతో ఓ వ్యక్తి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతన్ని మార్కాపురం వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం రెండు వారాలకు సరిపడా మందులు ఇచ్చి పంపించారు.
మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి కరోనా అనుమానితుడు