ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు - covid news in prkasam dst

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతునే ఉంది. చీరాల సంఘం థియేటర్ సమీపంలో ఒకరికి వైరస్ సోకగా... మెడికల్ షాపులతో సహా అన్ని దుకాణాలను అధికారులు మూసివేయించారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ను కూడా రెడ్ జోన్ పరిధిలోకి చేర్చారు.

corona postive cases increasing in prakasam dst chirala
corona postive cases increasing in prakasam dst chirala

By

Published : Jun 29, 2020, 3:57 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జయంతిపేట, రామ్ నగర్, వైకుంఠపురం, విఠల్ నగర్ ఆంధ్రరత్న రోడ్డు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. తాజాగా చీరాల సంఘం థియేటర్ సమీపంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు తేలింది.

చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, మెడికల్ షాపులు, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​తో సహా రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లాయి. రెడ్​జోన్​ పరిధిలోని మెడికల్ షాపులను అధికారులు మూసివేయించగా.. అత్యవసర సేవల నిమిత్తం మెడిసిన్ విక్రయించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ కూడా రెడ్ జోన్​లో పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో గడియారస్తంభం కూడలిలో టెంట్ వేసి పోలీస్ సిబ్బంది రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:

నన్ను పక్కకు తప్పించేందుకు స్కెచ్ వేశారు: రఘురామకృష్ణరాజు

ABOUT THE AUTHOR

...view details