ప్రకాశం జిల్లా యర్రగొండపాలోనికి చెందిన రాంబాబు అనే చిత్రకారుడు రహదారిపై కరోనా చిత్రాలు వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన అతను, తన బృందంతో కలిసి రోడ్డుపై కరోనా భయంకర రూపాన్ని చిత్రించాడు. జాగ్రత్తగా ఉండకపోతే ఆ మహమ్మారి మనల్ని బలిగొంటుందంటూ ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. జనమంతా ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను తరిమికొట్టాలంటూ సూచించాడు.
రోడ్డుపై చిత్రాలతో కరోనాపై అవగాహన - ప్రకాశం జిల్లాలో రోడ్లపై కరోనా చిత్రాలు తాజా వార్తలు
కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు కొవిడ్ మహమ్మారిపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
రోడ్డుపై చిత్రాలతో కరోనాపై అవగాహన