ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం.. భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ఒంగోలు డీఆర్ఆర్ఎమ్ ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, మరో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు.

పాఠశాలలో కరోనా కలకలం
పాఠశాలలో కరోనా కలకలం

By

Published : Aug 21, 2021, 5:06 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీఆర్ఆర్ఎమ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో.. ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అధికారులు పాఠశాలలో క్లోరినేషన్ చేశారు. పాఠశాలను మాత్రం యథావిధిగా నిర్వహించారు.

విజయనగరం జిల్లాలో కరోనా కలకలం..

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం నిమ్మవలస ప్రాథమిక పాఠశాలలో 2 వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు కర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి:

Taliban news: తాలిబన్లలకు మద్దతుగా పోస్టులు.. 14 మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details