ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్ : పొగాకు రైతు జీవితాల్లో కరోనా పొగ ! - పొగాకు రైతు జీవితాల్లో కరోనా పొగ

పొగాకు రైతుల జీవితాలను పొగపెట్టేవిధంగా పరిస్థితులు తయారయ్యాయి. ఒకవైపు ప్రకృతి సహకరించకపోవడం, రెండో వైపు కరోనా మహామ్మారి, మూడో వైపు బయ్యర్ల మాయాజాలంతో పొగాకు రైతు అతలాకుతలం అవుతున్నారు. కష్టించి పండించిన పంట గ్రేడ్‌ రాకపోవడం, లో గ్రేడ్‌ పేరు చెప్పి నోబిడ్లు అంటూ బోర్డు అధికారులు చెపుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాక్​డౌన్ ఎఫెక్ట్ : పొగాకు రైతు జీవితాల్లో కరోనా పొగ !
లాక్​డౌన్ ఎఫెక్ట్ : పొగాకు రైతు జీవితాల్లో కరోనా పొగ !

By

Published : Jun 25, 2020, 10:15 PM IST

ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లాక్‌ డౌన్‌ కారణంగా పొగాకు బోర్డు వేలం కేంద్రాలు మూసివేసి, కొనుగోళ్లు నిలిపేయటంతో... చెక్కులుగా కట్టుకున్న పొగాకు ఇళ్లల్లోనే నిల్వచేసుకోవలసి వచ్చింది. కొందరు రైతులు అందుబాటులో ఉన్న శీతలగిడ్డంగుల్లో భద్రపరుచుకున్నారు. దాదాపు నెలరోజుల తరువాత మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించారు. ఇతర దేశాలకు ఎగుమతులు కూడా నిలిచిపోవడంతో బయ్యర్లు కొనుగోళ్లకు అంత సుముఖత చూపటం లేదని రైతులు చెబుతున్నారు. ఆకు తయారయి ఎక్కువ కాలం కావడంతో రంగు మారిపోయి...నాణ్యత తగ్గి ధర ఘోరంగా పడిపోయిందని వాపోతున్నారు.

వేలం కేంద్రాలకు తీసుకువెళ్లిన పంటను నాణ్యత బాగులేదని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. నో బిడ్‌ అంటూ పక్కకు పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బేలుకు రానూపోనూ దాదాపు రూ. 200 ఖర్చు, 5 కేజీలు వరకూ తరుగుదల ఉంటుందని దీని వల్ల బేలుకు దాదాపు 6 నుంచి 7 వందలు నష్టపోతామని రైతులు వాపోతున్నారు. పది బేళ్లు తీసుకువస్తే కనీసం 4 బేళ్లు నో బిడ్డు అంటూ తిప్పి పంపిస్తున్నారన్నారు.

ప్రస్తుతానికి కొనుగోళ్లలో నో బిడ్డు ఎక్కువగా సాగుతుందని రైతులు తెలిపారు. మరికొన్ని నాణ్యమైన పొగాకును కూడా బేలులో చిన్ని చిన్న లోపాలు చూపించి సీఆర్‌ అంటూ కొనుగోళ్లు నిలిపేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మొత్తంలో గ్రేడ్ పొగాకే ఉంది కాబట్టి న్యాయమైన ధర చెల్లించి కొనుగోళ్లు చేయాలని రైతులుకోరుతున్నారు. నో బిడ్డు కారణంగా ఇంటివద్దకు తీసుకువచ్చిన పొగాకు బేళ్ళు చెడిపోతున్నాయని, శీతలగిడ్డంగుల్లో పెట్టుకుంటే ఒక్కో బేలుకు 600 వసూలు చేస్తున్నారన్నారు. అప్పులు తెచ్చిన రైతులకు కొనుగోళ్ళు సకాలంలో జరగపోతే వడ్డీ భారంతో మరింత నష్టపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నో బిడ్ల వల్ల తీవ్ర నష్టాల్లోకి వెళుతున్న తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details