ప్రకాశం జిల్లాలో ఎనిమిది కుటుంబాల్లో తల్లిదండ్రులు కరోనాతో మరణించారు. వారి పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న అమ్మా-నాన్నలు ఒక్కసారిగా దూరమవటంతో ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పి.సి.పల్లి మండలం చౌటగోగులపల్లిలో తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ఇంటర్ విద్యార్థిని శ్రీనవ్య, 4వ తరగతి విద్యార్థి సిద్ధార్థ బాగోగులను ప్రస్తుతం గ్రామస్థులే చూసుకుంటున్నారు.
Corona Virus: పసి మనసులపై పాడు వైరస్ పంజా - AP News
కొవిడ్ మహమ్మారి.. అనేక కుటుంబాల్లో కల్లోలం సృష్టించింది. వైరస్ బారినపడి తల్లిదండ్రులు చనిపోయి.. అనాథలుగా మారిన పిల్లలెందరో. ప్రస్తుతానికి గ్రామస్థులు వారిని సాకుతున్నా.. ప్రభుత్వమే శాశ్వత మార్గం చూపాలని పలువురు కోరుతున్నారు.
పసి మనసులపై పాడు వైరస్ పంజా
కొందరు పిల్లలు వారి తాతయ్యల దగ్గర ప్రస్తుతానికి ఉంటున్నారు. వయోభారం మీద పడుతుండటంతో ఎక్కువ కాలం సాకలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాథలుగా మారిన చిన్నారులను గుర్తించి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తోంది. ఆ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'