గ్రామాల్లో జరుగుతున్న నాలుగో విడత ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. చిన్నగంజాంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, వాలంటీర్లతో ఆయన సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి... అందరికీ మాస్కులు అందేలా చూడాలన్నారు. గర్భిణీలకు బాలామృతం , మాస్కులను అందించారు.
చిన్నగంజాంలో అధికారులతో కొవిడ్ ప్రత్యేక అధికారి సమావేశం - ఏపీలో లాక్డౌన్ వార్తలు
గ్రామాల్లో నాలుగో విడత ఇంటింటి సర్వే సక్రమంగా జరిపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు అందరికీ అందేలా చూడాలని వాలంటీర్లకు సూచిస్తున్నారు.

corona ceases in ongole