ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కంగారు పుట్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 10మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలు కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే.. క్వారంటైన్‌కు తరలిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన వీధులతోపాటు అంతర్గత రహదారుల్లోనూ ఇనుప కంచెలు వేశారు. రెడ్‌జోన్ నుంచి ఎవరూ బయటకురాకుండా..వారికోసం ప్రత్యేకంగా కూరగాయలు, నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేశారు.
చీరాలలో కరోనా కలవరం... ఒకేరోజు 10మందికి వ్యాధి - ప్రకాశం జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 10 మంది వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
corona cases