ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వేటపాలెంలో వృద్ధురాలు ఆరోగ్య పరీక్షల నిమిత్తం గుంటూరు వెళ్లగా ఆ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దరణైంది. దీంతో వేటపాలెంలోని ఆమె కుటుంబసభ్యులు 10 మందిని ఒంగోలు క్వారంటైన్‌కు తరలించారు.
జిల్లాలో జోరుగా విస్తరిస్తున్న కరోనా.. అప్రమత్తమైన అధికారులు - corona cases increased in prakasham district
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా ఆయా ప్రాంతాలను ద్రావణాలతో పిచికారీ చేస్తూ శుభ్రపరుస్తున్నారు.

జిల్లాలో జోరుగా విస్తరిస్తున్న కరోనా
చీరాలలో కొత్తగా కేసులు నమోదు కావడం ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్సు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలవారు కూరగాయల దుకాణం, పాలు, నిత్యవసరవస్తువులకు బయటకు రాకుండా దుకాణాలు అక్కడే ఏర్పాటు చేశారు. రహదారులు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు.
ఇవీ చూడండి..