ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాప్తి: 191కు పెరిగిన బాధితుల సంఖ్య - corona cases increased at prakasham dist

ప్రకాశం జిల్లాలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఒకటి, రెండు కేసులు నమోదవుతుండగా సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మరో రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు.

corona cases increased
ప్రకాశంలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Jun 16, 2020, 1:18 PM IST

ప్రకాశం జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమ, మంగళ వారాల్లో నమోదైన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 191కు చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. రెండు రోజుల్లో నమోదైన 21 కేసుల్లో ఒంగోలులో నలుగురు, టంగుటూరు మండలం కందులూరికి చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

చీరాలలో కూడా ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు నమోదైన 191 కేసుల్లో 114 మంది కోలుకొని డిచార్జ్ అయ్యారు. మిగిలిన వారంతా ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి రాకపోకలపై నిషేధం విధించారు. బ్యారికేడ్లు వేసి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details