ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరి నియోజకవర్గంలో విజృంభిస్తున్న కరోనా - covid news in prakasam dst

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉగ్ర రూపం దాల్చుతుంది. నియోజకవర్గంలో కనిగిరి, పామూరు మండలాలపై మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. అధికారులు కరోనా కట్టడికి ప్రణాళికలు రూపొందించి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసుల తీవ్రత ఆగటం లేదు.

corona cases in prakasam dst kanigiri are increasing
corona cases in prakasam dst kanigiri are increasing

By

Published : Aug 8, 2020, 11:54 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నియోజకవర్గంలో మండలాల వారీగా కరోనా కేసుల వివరాలు .....కనిగిరి మండలంలో మొత్తం 375 మంది కరోనా బారిన పడగా వారిలో 264 మంది కోలుకున్నారు. 11 మంది మృతి చెందారు. మూరు మండలములో మొత్తం 318 మంది కరోనా బారిన పడగా వారిలో 280 మంది కోలుకోగా 9 మంది మృతి చెందారు.

వెలిగండ్ల మండలములో మొత్తం 20 మంది కరోనా బారిన పడగా వారిలో 17 మంది కోలుకున్నారు. హనుమంతుని పాడు మండలములో మొత్తం 17 మంది కరోనా బారిన పడగా వారిలో 13 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు. పి.సి.పల్లి మండలంలో మొత్తం 54 మంది కరోనా బారిన పడగా వారిలో 47 మంది కోలుకున్నారు. చంద్ర శేఖరాపురం మండలంలో మొత్తం 26 మంది కరోనా బారిన పడగా వారిలో 24 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details