ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లాలో 60 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు.. వీరందరికీ ఒంగోలు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు 9,748 మందికి పరీక్షలకు నిర్వహించగా.. 5411 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 4,278 మంది నమూనాలకు సంబంధించి ఫలితాలు రావలసి ఉంది. 23 మంది కోలుకున్నారు. మిగిలిన వారిలో ఒకరు నెల్లూరులో చికిత్స పొందుతున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రూనాట్ కిట్ల ద్వారా రెడ్ జోన్ ప్రాంతంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు నిషేధించారు. నిత్యావసరాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిధ్దార్థ... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. పోలీసులకు, అధికారులకు సూచనలు ఇస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో మరో 4 కరోనా కేసులు... మొత్తం 60 - ప్రకాశం జిల్లాలో కొవిడ్ వార్తలు
ప్రకాశం జిల్లాలో ఈరోజు నమోదైన 4 కేసులతో కలిపి మొత్తం సంఖ్య 60కి చేరింది. దీంతో అధికార యంత్రాంగం భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో ట్రానాట్ కిట్ల ద్వారా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు