ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. చీరాల పట్టణంతో పాటు, రెడ్ జోన్ ప్రాతమైన పేరాలలో సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. మున్సిపల్ ప్రత్యేక వాహనం, అగ్నిమాపక వాహనం ద్వారా ద్రావణాన్ని సిబ్బంది పిచికారి చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో లాక్డౌన్ నింబంధనలు కఠినతరం చేశారు.
చీరాలలో కరోనా కలవరం... అప్రమత్తమైన అధికారులు - చీరాలలో లాక్డౌన్
ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులు లాక్డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
చీరాలలో సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావవణం పిచికారి