ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. తాజాగా పట్టణంలో పాజిటివ్ కేసులు నమోదుకావడంతో భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో కేసులు వచ్చిన ప్రాంతంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. చీరాల పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు.. అంతర్గత రహదారుల్లో ఇనుప కంచెను అడ్డుగా వేశారు. అనవసరంగా రహదారులపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
'కేసులు పెరుగుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి' - corona cases in cheerala
కరోనా మహమ్మారి విజృంభిస్తునే ఉంది. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న చీరాల పట్టణంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్నిపిచికారీ చేస్తున్నారు.
corona cases