ప్రకాశం జిల్లా చీరాలలో కరోనాపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు పట్టణంలో ప్రజలు నిత్యవసరాలు కొనుగోలు చేయటానికి అధికారులు సమయం ఇచ్చారు. మున్సిపల్ అధికారులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కరోనా మహమ్మారి ఆకారంలో మాస్కు వేసుకుని భౌతికదూరం పాటించకపోతే... మీ వెంట వస్తా.. మీ ఇంటి కోస్తా.. అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు.
'మీ వెంట వస్తా... మీ ఇంటికి వస్తా' అంటూ కరోనాపై అవగాహన
చీరాలలో మున్సిపల్ అధికారులు కరోనాపై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. భౌతిక దూరం పాటించకపోతే 'మీ వెంట వస్తా... మీ ఇంటి కొస్తా' అంటూ ప్లకార్డులు పట్టకొని కరోనా వేషంలో చెబుతున్నారు.
చీరాలలో కరోనా వేషం వేసుకుని వినూత్న ప్రచారం చేస్తున్న మున్సిపల్ అధికారులు