ప్రకాశం జిల్లా దర్శిలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. మహమ్మారి పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపిస్తోంది. లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి కరోనా వ్యాప్తి పెరిగింది. శుక్రవారం దర్శి నియోజకవర్గంలో నాలుగు కేసులు నమోదుకాగా.. శనివారం మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. శనివారం దర్శికి చెందిన 65ఏళ్ల వృద్దుడు కరోనా మహమ్మారితో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపిస్తున్న కరోనా - corona at darsi
లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం దర్శికి చెందిన 65ఏళ్ల వృద్దుడు కరోనా మహమ్మారితో మృతి చెందాడు.
దర్శిలో పెరుగుతున్న కరోనా కేసులు
తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం, రామభద్రాపురంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దర్శి డీఎస్పీ ప్రకాశరావు, సీఐ తాళ్ళూరు మండలంలోని కరోనా సోకిన ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు తగు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: ముగిసిన రంగుల పంచాయితీ... తెలుపు రంగులోకి భవనాలు