ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.
సిలికాశాండ్ బిల్లుల వద్ద అధిక లోడుతో అక్రమంగా 3 టర్బో లారీల్లో ఇసుకను తరలిస్తుండగా... పట్టుకున్నట్లు సీఐ విజయ్ భాస్కర్ తెలిపారు. లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు.