ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెన్నకేశవ స్వామి ఆలయ భూముల వేలంలో కొట్లాట - Controversy over land auction

ప్రకాశం జిల్లాలోని దావగూడూరు గ్రామ చెన్నకేశవ స్వామి ఆలయ భూముల వేలం పాట నిర్వహణలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇరువర్గాలు ఈ భూముల లీజు దక్కించుకోడానికి పోటీపడ్డారు... ఈ పోటీ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది.. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు..

controversy-over-davaguduru-chennakesava-swamy-temple-land-auction-at-prakasham-district
చెన్నకేశవ స్వామి ఆలయ భూముల వేలంలో కొట్లాట

By

Published : Oct 5, 2021, 10:39 AM IST

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని దావగూడూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయ భూములకు సోమవారం వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్లాటలు చోటు చేసుకున్నాయి. ఆలయానికి మండలంలోని పలు గ్రామాల్లో భూములున్నాయి. 247.66 ఎకరాలకు వేలం నిర్వహించగా... 1-1లోని 5.05 ఎకరాల భూమిని గతంలో దావడూగురుకు చెందిన ముప్పా శ్రీను రూ.45 వేలకు దక్కించుకున్నారు. సోమవారం నాటి పాటలో అదే గ్రామానికి చెందిన నార్ని పద్మావతి రూ.65,500కు పాడుకున్నారు.

దీంతో గతంలో పాడుకున్న వారు, వారి కుటుంబీకులు ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి ప్రయత్నించారు. కుర్చీలు విసిరారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించారు. విషయం తెలుసుకున్న సీఐ లక్ష్మణ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో 144 సెక్షన్‌ అమలు చేశారు.

ఇదీ చూడండి:వాట్సాప్​, ఇన్​స్టా, ఫేస్​బుక్​ సేవలు పునరుద్ధరణ

ABOUT THE AUTHOR

...view details