ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బకాయి సొమ్ము చెల్లించాలంటూ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - Contract sanitation workers agitation at podhili municipal office

ప్రకాశం జిల్లా పొదిలిలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఐదు నెలలుగా బకాయి ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలంటూ.. నిరసన వ్యక్తం చేశారు.

Contract sanitation workers  agitation
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

By

Published : Mar 30, 2021, 5:56 PM IST

పొదిలి నగర పంచాయితీ కార్యాలయం ఎదుట ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. ఐదు నెలలుగా తమ వేతనాలు పెండింగ్​లో ఉన్నాయంటూ.. డెబ్భై మంది కార్మికులు ధర్నా నిర్వహించారు. తమకు పారిశుద్ధ్యం తప్ప మరో వృత్తి తెలియదని కార్శికులు అన్నారు.

ఇలా.. నెలల తరబడి వేతనాలు చెల్లించక పోతే కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని.. ఆవేదన చెందారు. కొవిడ్​ కాలంలో ఎంతో కష్టించిన తమను ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని అన్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ వేతనాలు త్వరగా ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details