ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలులో కాంగ్రెస్ నిరసన ర్యాలీ - congress party protest at ongole prakasham district

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ
ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ

By

Published : Sep 29, 2020, 4:07 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఒంగోలులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ నుంచి, కలెక్టర్ కార్యాలయం వరకు ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.

రైతుల నడ్డి విరిచే విధంగా, దళారీలకు అనుకూలంగా ఈ బిల్లుల్లో ప్రతిపాదనలు ఉన్నాయని వారంతా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details