"తొలి సంతకం హోదా పైనే" - prakasam
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక హోదా భరోసా యాత్ర ప్రకాశం జిల్లా అద్దంకిలో సాగింది.
!["తొలి సంతకం హోదా పైనే"](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2549061-387-c1559d62-9a28-4074-8a77-e1c081bea086.jpg)
ప్రత్యేక హోదా భరోసా పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న యాత్ర ప్రకాశం జిల్లా అద్దంకి చేరుకుంది. నియోజకవర్గ ప్రజల నీటి సమస్యపై ఆదివారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సీతారామాంజనేయులకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ సంఘీభావం తెలిపారు. అనంతరం అతనికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హోదా పైనే తొలి సంతకం ఉంటుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు.