ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడులోని రామయోగయ్య స్వామి ఉత్సవాలలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీలకతీతంగా ఏర్పాటు చేసిన కోలాటం వేదికపైకి స్థానిక వైకాపా నేతలు.. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ని ఆహ్వానించారు. దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు.. వ్యతిరేకుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అర్ధం చేసుకున్న మద్దిశెట్టి.. వేదిక మీద నుంచి దిగి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే వేదిక పైకి వచ్చారు.. ఉత్సవంలో తలెత్తిన వివాదం - ప్రకాశం వార్తలు
పార్టీలకతీతంగా జరుగుతున్న ఉత్సవాల వేదికపైకి వైకాపా ఎమ్మెల్యే రావటంతో స్థానికుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆ ప్రజా ప్రతినిధి వేదిక దిగి వెనుదిరిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడులోని రామయోగయ్య స్వామి ఉత్సవాల్లో జరిగింది.
ఉత్సవంలో వాగ్వాదం
అనూహ్యంగా జరిగిన పరిణామానికి కోలాట నిర్వాహకులు క్షమాపణలు చెప్పటంతో అంతా సద్దుమణిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఓట్లు, పల్లె పాలనలో అతివలదే పైచేయి.. రాజకీయ సాధికారత దిశగా అడుగులు