ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని చల్లగిరి పంచాయతీ సచివాలయంలో వైకాపా కార్యకర్తల మధ్య బాహాబాహి జరిగింది. కనిగిరి నియోజకవర్గ స్థాయి నాయకుల సమక్షంలోనే ఈ ఘర్షణ జరిగింది. చల్లగిరిలోని ఇంటి నివేశన స్థలాల విషయంలో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఒక వర్గం వారు సంబంధిత వార్డు వాలంటీర్ల ద్వారా అర్హుల జాబితా తయారు చేయించారు. మరొక వర్గం వారు ఇవేమీ పట్టనట్లుగా నియోజకవర్గ స్థాయి నాయకులు మా వర్గం వారని మేము చెప్పినట్లుగానే వినాలని పట్టుబట్టి ఇస్టానుసారంగా మరో జాబితా తయారు చేయించారు. దీంతో రెండు వర్గాల మద్య వివాదం చెలరేగి తోపులాటకు దారి తీసింది. అక్కడే వున్న వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి మడతల కస్తూరి రెడ్డి, మండల వైకాపా అధ్యక్ష్యుడు సంగు సుబ్బారెడ్డి ఇరువర్గాల నాయకులతో మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది. ఎమెల్యే మధుసూదన్ అర్హులైన వారికి నివేశన స్థలాలు ఇప్పిస్తామని నాయకులకు చెప్పారు.
చల్లగిరిలో వైకాపా కార్యకర్తల బాహాబాహి - చల్లగిరి వైకాపా నాయకుల మధ్యఘర్షణ
నియోజకవర్గ స్థాయి నాయకుల సమక్షంలోనే ఇరువర్గాల వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని చల్లగిరి పంచాయతీ సచివాలయంలో ఇంటి నివేశన స్థలాల విషయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

చల్లగిరి ఇరువర్గాల వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట