ప్రకాశంజిల్లా తాళ్ళూరు నుంచి కుంకుపాడుకు వెళ్ళే మార్గంలో ముండ్లమూరు మండలం సరిహద్దులో కోళ్ళ ఫారాలున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు అక్కడ పనిచేస్తుంటారు. ఒరిస్సాకు చెందిన కార్తీక్ అతని భార్యతో పాటు అక్కడే ఉంటున్నాడు. బుధవారం రాత్రి కార్తీక్ దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన కార్తీక్ చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యతో గొడవ... ఆమె చున్నీతోనే ఉరివేసుకున్న భర్త - Conflict between husband and wife ... Husband committed suicide
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. మనస్థాపానికి గురైన భర్త... చున్నీతో ఫ్యాను కు ఉరివేసుకుని ప్రాణాలొదిలాడు. ఈ విషాదకర ఘటన ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం సరిహద్దులో జరిగింది.
Breaking News
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
ఇవీ చదవండి: పోషక హాహాకారం...!నీళ్ల సాంబారు, మజ్జిగే దిక్కు