ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్చూరులో క్రీడా ప్రాంగణం ప్రారంభం - prakasham district latestnews

ప్రకాశం జిల్లా పర్చూరులో యువతకు క్రికెట్​లో శిక్షణ ఇచ్చేందుకు నిర్మించిన కేంద్రాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ వై. వేణుగోపాలరావు ప్రారంభించారు.

A solid history of brilliance in cricket
పర్చూరులో క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన

By

Published : Feb 1, 2021, 1:05 PM IST

Updated : Feb 1, 2021, 4:33 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరులో మంగమూరు రోడ్డులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మైదానాన్ని ఏసీఏ క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్, భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాలరావు పరిశీలించారు. క్రికెట్​లో జిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉందని... ఇక్కడి నుంచి ఎందరో క్రీడాకారులు రాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించారని పేర్కొన్నారు.

కొంత కాలంగా సరైన క్రీడా సౌకర్యాలు లేక జిల్లాలోని క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి కోసం ఏసీఏ ప్రత్యేక చొరవ చూపి మైదానం ఏర్పాటుకు సహకరించిందని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లాలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్టేడియం ఏర్పాటుకు ఏసీఏ కృషి చేస్తుందన్నారు. రంజీ క్రీడాకారుడు కల్యాణ్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Feb 1, 2021, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details