తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని నిరసిస్తూ.. ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజాసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ముక్కోణం పార్క్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద త్రిమూర్తులు ఎమ్మెల్సీని రద్దు చేయాలని నినాదాలు చేశారు. అతన్ని పదవి నుంచి తొలగించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిగా ఉన్న తోటా త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రజా సంఘాల నాయకుడు మోహన్ కుమార్ ధర్మా అన్నారు. దళిత ద్రోహిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేయటం దుర్మార్గమని మండిపడ్డారు.
తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి: ప్రజాసంఘాల నాయకులు
తోట త్రిమూర్తులుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రజాసంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అతన్ని పదవి నుంచి తొలగించాలంటూ ముక్కోణం పార్క్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
దళిత, గిరిజనుల సంక్షేమానికి కృషిచేస్తానన్న సీఎం జగన్.. దళిత వ్యతిరేకి అయిన త్రిమూర్తులుకు పదవి ఎలా ఇచ్చారో తెలియటం లేదని మోహన్ కుమార్ ధర్మా అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు, గిరిజనులు ఉద్యమం లేవనెత్తుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు పులిపాటి రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:manthena sathyanarayana : దొంగే... దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు: మంతెన సత్యనారాయణ