ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టికల్​ 370 రద్దు ప్రజాస్వామ్య విరుద్ధం: వామపక్షాలు

ఆర్టికల్​ 370 రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని వామపక్షాల నేతలు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన చేపట్టారు. వామపక్షాల నాయకులతో పాటు పలువురు మేథావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By

Published : Aug 25, 2019, 10:31 PM IST

ఆర్టికల్​ 370 రద్దు ప్రజాస్వామ్య విరుద్ధం:వామపక్షాలు

ఆర్టికల్​ 370 రద్దు ప్రజాస్వామ్య విరుద్ధం:వామపక్షాలు

కశ్మీర్ పర్యటనకు ప్రతిపక్ష నాయకులు వెళ్లకుండా కేంద్రం ఆంక్షలు విధించడం అన్యాయమని వామపక్షాల నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సుందరయ్య భవన్​లో 'జమ్ము కశ్మీర్ విచ్ఛిన్నం-ప్రజాసామ్యం, ఫెడరలిజంపై దాడి' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులతో పాటు పలువురు మేథావులు పాల్గొన్నారు. జమ్ము-కశ్మీర్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుని తప్పుపట్టారు. 370 ఆర్టికల్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కశ్మీరీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details