సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే, తెదేపా కనిగిరి నియోజకవర్గ బాధ్యుడు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. చాయ్ వాలా పేరుతో తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేవాంగ్ నగర్, టకారిపాలెం, కాశిరెడ్డినగర్, టైలర్స్ కాలనీల్లో కార్యకర్తలతో కలసి పర్యటించారు. ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.
'సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి వచ్చా' - 'సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి వచ్చా
ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి వాడవాడలా తిరుగుతూ.. అపన్నులకు సాయం అందించారు. దేవాంగ్ నగర్, టకారిపాలెం, కాశిరెడ్డినగర్, టైలర్స్ కాలనీల్లో కార్యకర్తలతో కలసి పర్యటించారు. ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.
'సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి వచ్చా'
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియాజకవర్గంలో గడిచిన ఎనిమిదేళ్లలో ఉచితంగా 45 వేల మందికి కంటి పరీక్షలు, 20వేల మందికి ఆపరేషన్లు, మరి కొంతమందికి కీళ్లమార్పిడి చికిత్సలు చేయించానని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టించి ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. ఓ అనాథ బాలికకు కొంత నగదును అందజేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.